టెన్షన్ గా మారుతున్న తారక రత్న ఆరోగ్య సమాచారం.!

Published on Jan 28, 2023 1:00 pm IST

టాలీవుడ్ ప్రముఖ నటుడు అలాగే యువ రాజకీయ నాయకుడు అయినటువంటి నందమూరి తారక రత్న ఊగించని విధంగా తీవ్ర అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. దీనితో తన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు వార్తలు బయటకి వస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ మాత్రం కాస్త టెన్షన్ గా మారింది అని చెప్పాలి. తాను గుండెపోటుతో బాధపడుతుండగా బృందం బెంగళూర్ కి తీసుకెళ్లారు.

అయితే అక్కడ చికిత్స చేస్తుండగా తనకి బీపీ ఆకస్మికంగా పెరిగిందట దీనితో ఒంట్లో రక్త స్రావం జరుగుతుందని తెలిసింది. దీనితో ఈ బ్లీడింగ్ ని నియంత్రించడానికి డాక్టర్ లు ఉదయ్ కనల్కర్ మరియు రఘు బృందం వారు చాలా కష్టపడుతున్నారట. అలాగే మరోపక్క తారకరత్న కి ప్రత్నామ్యాయంగా ఎక్మో ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారట. మరి నందమూరి తారక రత్న త్వరగా కోలుకోవాలని మా 123తెలుగు యూనిట్ కోరుకుంటూ ప్రార్థిస్తుంది.

సంబంధిత సమాచారం :