‘ఆర్ఆర్ఆర్’ లో కూడా కొత్త లుక్ లో తారక్ !

Published on Oct 22, 2018 9:22 am IST

అరవింద సమేత విడుదలై ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఎన్టీఆర్ తన ఫోకస్ అంత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫై పెట్టాడు. అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో తారక్ , రామ్ చరణ్ తో కలిసి నటించనున్నాడని తెలిసిందే.

ఇక ఆయన ఈ చిత్రం కోసం తన లుక్ ను పూర్తి గా మార్చుకోనున్నాడట. ఇందుకోసం జింబాబ్వే కు చెందిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ లోయ్డ్ స్టీవెన్స్ తో రాజమౌళి ఎన్టీఆర్ లుక్ గురుంచి చర్చించారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈచిత్రం నవంబర్ లేదా డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :