రేపు సుదర్శన్ థియేటర్ కి “జెర్సీ” టీమ్!

రేపు సుదర్శన్ థియేటర్ కి “జెర్సీ” టీమ్!

Published on Apr 19, 2024 3:30 PM IST


టాలీవుడ్ హీరో, నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ. ఈ చిత్రం 2019 లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ స్పెషల్ షోస్ ను ఏర్పాటు చేశారు. అయితే టీమ్ జెర్సీ ఆడియెన్స్ ను కలిసేందుకు రెడీ అయిపోయింది.

సుదర్శన్ 35ఎంఎం ధియేటర్ లో రేపు సాయంత్రం 6:00 గంటల జెర్సీ షో కు హీరో నాని, డైరెక్టర్ గౌతం తిన్ననూరి తో పాటుగా, ప్రొడ్యూసర్ నాగ వంశీ హాజరు కానున్నారు. జెర్సీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం తో సెలబ్రేట్ చేసుకోడానికి వస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందించగా, శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రలో నటించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు