యూరప్ లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ సాంగ్ !

యూరప్ లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ సాంగ్ !

Published on Apr 29, 2019 8:39 AM IST

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సాహో’. గత ఎనిమిది రోజులుగా యాక్షన్ సీన్స్ కు సంబంధించి ముంబైలో షూట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే
ముంబైలో షూట్ పూర్తి కానుంది. ముంబై లో తీసిన ప్రభాస్ యాక్షన్ సీన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటాయట. ఇక సాహో చిత్రబృందం త్వరలో యూరప్ వెళ్లనుంది. శ్రద్ధా కపూర్ -ప్రభాస్ ఇద్దరి మీద ఒక రొమాంటిక్ సాంగ్ ను అక్కడ షూట్ చేస్తారట.

ఆగష్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. కాగా ఇటివలే సాహో నుండి ఒక ఫోటో లీకయింది. ఆ ఫోటోలో శ్రద్ధా కపూర్ – ప్రభాస్ ఇద్దరూ ఒకరికళ్ళలోకి ఒకరు మంచి రొమాంటిక్ మూడ్ లో చూసుకుంటూ కనిపించారు. ఆ ఒక్క ఫోటోకే ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘యు.వి క్రియేషన్స్’ ఈ సినిమాను నిర్మస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు