ఇంట్రెస్టింగ్ గా తేజ సజ్జ న్యూ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్

ఇంట్రెస్టింగ్ గా తేజ సజ్జ న్యూ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్

Published on Apr 15, 2024 4:16 PM IST

ఇటీవల హను మాన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకున్నారు యువ నటుడు తేజ సజ్జ. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఆ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. ఇక తాజాగా ఈగిల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా రూపొందనున్న మూవీ యొక్క అనౌన్స్ మెంట్ పోస్టర్ నేడు వచ్చింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి 36వ ప్రాజక్ట్ గా రూపొందుతున్న ఈ మూవీ యొక్క టైటిల్ తో పాటు గ్లింప్స్ ని ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. గౌర హరి సంగీతం అందించనున్న ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్ గా నటించనుండగా మంచు మనోజ్, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన మరిన్ని వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు