నవంబర్ 12న థియేటర్ల లోకి వస్తున్న “తెలంగాణ దేవుడు”

Published on Nov 8, 2021 11:14 am IST

మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన తాజా చిత్రం తెలంగాణ దేవుడు. ఉద్యమనాయకుడి పాత్రలో పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్‌ నటించగా, జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. సంగీత, బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, తనికెళ్ల భరణి వంటి 50 మంది అగ్ర నటీనటులు నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకాబోతోంది.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ, “మా చిత్రం తెలంగాణ దేవుడు కి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ 12న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాము. చిత్ర నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా హీరో శ్రీకాంత్‌గారు అందించిన సహకారం మరువలేనిది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చరిత్రతో వస్తున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. ఈ చిత్రంతో జిషాన్ ఉస్మాన్ అనే నూతన నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాము. ప్రేక్షకులు ఈ సినిమాని థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము” అని అన్నారు.

పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్, సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్యకృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ నందన్ బొబ్బిలి, సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్, ఎడిటర్ గౌతంరాజు, మూల కథ, నిర్మాత మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ లుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వడత్యా హరీష్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :