సైరా మూవీ కుటుంబ సభ్యులతో వీక్షించిన గవర్నర్

Published on Oct 9, 2019 9:06 pm IST

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి నటించిన “సైరా నరసింహారెడ్డి” ఘనవిజయం సాధించింది. రా ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో భారీగా విడుదల కావడం జరిగింది. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేశారు. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం ఈ చిత్రాన్ని ప్రశంసించారు. అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో సైరా చిత్రం రూపొందించడం జరిగింది.

కాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తన కుటుంబంతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. గవర్నర్ కుటుంబం కోసం ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్రబృందం ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. తన సినిమా “సైరా”ను చూడాల్సిందిగా గవర్నర్‌ను గత శనివారం చిరంజీవి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. చిరు ఆహ్వానం మేరకు గవర్నర్ తన కుటుంబంతో కలిసి మంగళవారం రాత్రి “సైరా”ను వీక్షించి చిత్రాన్ని ప్రశంసించారు.

సంబంధిత సమాచారం :

X
More