ఈ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్ కోసం పిచ్చెక్కిపోతున్నారు!

Published on Oct 24, 2020 3:00 am IST


ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ లో ఓటిటి ప్లాట్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ఏ విధంగా శాసిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకు ముందు అంటే పెద్దగా అందరికీ తెలియకపోలేదు కానీ ఈసారి వచ్చిన లాక్ డౌన్ మూలాన ఓటిటి లో ఉన్న కంటెంట్ అంతా సామాన్య ప్రేక్షకుడికి కూడా దగ్గరయ్యిపోయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఒకటి.

అన్నిటిలానే ఇందులో కూడా అనేక సినిమాలు వెబ్ సిరీస్ లు ఉంటాయి. చాలా మట్టుకు తెలుగులో కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే అవన్నీ డబ్బింగ్ వే ఉన్నప్పటికీ ఒక్క వెబ్ సిరీస్ మాత్రం తెలుగు ఆడియెన్స్ కు ముఖ్యంగా యూత్ లో సెపరేట్ క్రేజ్ ను తెచ్చుకుంది మాత్రం “మీర్జాపూర్” వెబ్ సిరీస్. 2018లో మొదటి సీజన్ అందుబాటులోకి వచ్చిన ఈ హిందీ వెబ్ సిరీస్ తెలుగు డబ్ అయ్యాక విపరీతమైన క్రేజ్ ను సంతరించుకుంది.

అడల్ట్ కంటెంట్ అనే కాకుండా ఎపిసోడ్ ఎపిసోడ్ కు కూడా ఇంటెన్స్ గా సాగే స్క్రీన్ ప్లే అలాగే మున్నాభయ్యా అనే రోల్ మన తెలుగు ఆడియెన్స్ తో పాటుగా ఇతర భాషల యూత్ ను కూడా అట్రాక్ట్ చేసాయి. దీనితో అంతా సీజన్ 2 కోసం ఎప్పటి నుంచో ఎదురు చూడడం మొదలు పెట్టారు. కానీ దానిని అనౌన్స్ చేసే క్రమంలో మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వారికి భారీ ఎత్తున తెలుగు వెర్షన్ డబ్బింగ్ కావాలని మనవాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.

ఈ సిరీస్ కు సంబంధించి ఏదన్నా పోస్ట్ పడితే అందులో 80 శాతానికి పైగా తెలుగు వెర్షన్ వస్తుందా లేదా అన్నదానిపైనే కామెంట్స్ దర్శనమిస్తాయి. అంటే ఆ రేంజ్ లో మనవాళ్ళకి ఈ సిరీస్ ఎక్కేసింది. ఈరోజే ఎక్స్ క్లూజివ్ గా రిలీజ్ కాబడిన రెండో సీజన్ తెలుగు డబ్ లేకపోయేసరికి మరోసారి అమెజాన్ ప్రైమ్ వీడియోపై తెలుగు ఆడియెన్స్ దండెత్తారు. మొత్తానికి మాత్రం ఈ సిరీస్ తెలుగు వెర్షన్ కోసం మనవాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు.

సంబంధిత సమాచారం :

More