మిస్కిన్ కొత్త సినిమా చూసేందుకు రెడీ అంటున్న ఫ్యాన్స్

Published on Nov 12, 2019 8:17 am IST

దర్శకుడు మిస్కిన్ స్టైల్ అందరి దర్శకుల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆయన చూజ్ చేసుకునే కథలు, టేకింగ్ విధానం ప్రేక్షకులకి కొత్త తరహా సినిమాల్ని చూసిన అనుభూతిని అందిస్తాయి. అందుకే ఆయన సినిమాల కోసం ఎదురుచూసే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. అయన సినిమాలు ‘పిశాచి, డిటెక్టివ్’ తెలుగులో కూడా విడుదలై మంచి పేరు తెచ్చుకున్నాయి.

ప్రస్తుతం ఆయన రూపొందించిన కొత్త చిత్రం ‘సైకో’. ఉదయనిధి స్టాలిన్, నిత్య మీనన్, అధితిరావ్ హైదరిలు ఈ సినిమాలో ప్రధాన పాత్రదారులు. డిసెంబర్ 27న ఈ చిత్రం విడుదలకానుంది. చిత్ర టీజర్ గొప్పగా ఉండటంతో ప్రేక్షకుల్లో సినిమాపై అభిమానుల్లో అంచనాలు బాగా ఏర్పడ్డాయి. తెలుగు ఆడియన్స్ సైతం బాగా ఇంప్రెస్ అయ్యారు. సినిమా తెలుగులో కూడా డబ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు.

అయితే ఇప్పటివరకు ఈ సినిమా డబ్బింగ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఇకపై ఎవరైనా నిర్మాతలు డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకుంటారో లేకపోతే విడుదలయ్యాక రిజల్ట్ చూసి రీమేక్ రైట్స్ కొంటారో చూడాలి. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లో తెలుగు సినిమాలు రూపొందడం చాలా తక్కువ. పైగా ఆ తరహా సినిమాలకు అన్ని వర్గాల్లో ఆదరణ ఉంటుంది. కాబట్టి సినిమాను డబ్ చేసినా, రీమేక్ చేసినా నిర్మాతలకు లాభాలు దక్కే ఛాన్స్ ఉంది.

సంబంధిత సమాచారం :

More