సైన్స్ ఫ్రిక్షన్ సినిమాలకు జనాదరణ ఎక్కువ : దర్శకుడు రాఘవేంద్ర వర్మ

సైన్స్ ఫ్రిక్షన్ సినిమాలకు జనాదరణ ఎక్కువ : దర్శకుడు రాఘవేంద్ర వర్మ

Published on Dec 6, 2020 6:55 AM IST

కె రాఘవేంద్ర రావు గారి సమర్పణలో సూచిత డ్రీం వర్క్స్ ప్రొడక్షన్ పతాకం పై సుశాంత్, చాందిని చౌదరి మరియు సిమ్రాన్ చౌదరి ముఖ్య తారాగణం తో రాఘవేంద్ర వర్మ దర్శకత్వం లో విశ్వాస్ హన్నూర్ కార్ నిర్మించిన రోబోటిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం “బొంబాట్” డిసెంబర్ 3 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్ర వర్మ మాట్లాడుతూ “తెలుగు లో విడుదలైన సరికొత్త సినిమా బొంబాట్. రోబోటిక్ కాన్సెప్ట్ తో అందమైన ప్రేమ కథ తో కుటుంబ విలువలతో కనువిందు చేసే గ్రాఫిక్స్ తో అందమైన పాటలతో మంచి కామెడీ తో కుటుంబం అంత కలిసి చూసేలా ఉంటుంది మా బొంబాట్ చిత్రం. మా సినిమా ని విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు” అని తెలిపారు.

నిర్మాత విశ్వాస్ హన్నూర్ కార్ మాట్లాడుతూ “ముందుగా మా బొంబాట్ ని విజయవంతం చేసిన ప్రేక్షకులకి నా ధన్యవాదాలు. రోబోటిక్ అంశం తో సరికొత్త కాన్సెప్ట్ తో విడుదలైన సినిమా అందరిని ఆకట్టుకుంది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దగ్గరనుంచి ప్రతి తెలుగు ప్రేక్షకుడు సినిమా అద్భుతంగా ఉంది అని కామెంట్ చేస్తున్నారు. జోష్ బి గారు అందించిన సంగీతం మరియు గ్రాఫిక్స్ సినిమాలో అద్భుతంగా ఉన్నాయి. చూసిన వారికి ధన్యవాదాలు మరియు చూడని వారు ఉంటె తప్పకుండా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ” అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు