జూలై నుండి బిగ్ బాస్ సీజన్ 2

ఎన్టీఆర్ హోస్ట్‌ చేసిన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’. స్టార్ మాలో ప్రసారమై బాగా పాపులర్ అయ్యింది ఈ షో. తాజాగా ‘బిగ్ బాస్ 2’ మొదలు కాబోతోంది. నాని ఈ షోకు వ్యాఖ్యాతగా చెయ్యబోతున్నాడు. త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్న ఈ షో జూలై నుండి ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం ఈ షో కోసం కంటెస్టెంట్స్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో తెలియున్నాయి.

తొలి సీజన్లో బిగ్ బాస్ షో హోస్ట్‌గా అలరించిన ఎన్టీఆర్ సెకండ్ సీజన్ కూడా తనే హోస్ట్ చేస్తాడని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలతో బిజీ కాబోతుండడంతో ఆ ఆ స్థానాన్ని నాని భర్తీ చేసాడు. నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా ఏప్రిల్ 12 న విడుదల కానుంది ఈ సినిమా తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కాబోతున్నాడు ఈ హీరో.