కమల్ కి విలన్ ఆ తెలుగు కమెడియనే !

Published on Feb 28, 2023 10:00 am IST

విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఐతే, ఈ సినిమాలో టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. భారతీయుడు 2లో వెన్నెల కిశోర్ నెగటివ్ రోల్‌లో కనిపించనున్నాడని టాక్. వెన్నెల కిశోర్ పాత్ర గురించి ఇంకా అదనపు వివరాలు తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో ఇంటర్వెల్ లో కమల్ హాసన్ నటన సినిమాకే హైలైట్ గా నిలుస్తోందట.

కాగా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ‘భారతీయుడు 2’లో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ భారతీయుడు 2 రన్ టైం 3 గంటలకు పైనే నిడివి ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ ఈ నిడివి ని కూడా తగ్గించే పనిలో ఉన్నారట.

సంబంధిత సమాచారం :