బాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న తెలుగు డైరెక్టర్

Published on Oct 23, 2020 9:17 pm IST

తెలుగులో ‘పిల్ల జమిందార్, భాగమతి’ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు అశోక్. ‘భాగమతి’ ఇచ్చిన విజయంతో అశోక్ బాలీవుడ్ బాట పట్టారు. ఆ చిత్రాన్ని హిందీలో ‘దుర్గావతి’గా రీమేక్ చేస్తున్నారు అశోక్. ఇందులో భూమీ పడ్నేకర్ టైటిల్ రోల్ చేస్తోంది. చిత్రీకరణ తుది దశలో ఉంది. అక్షయ్ కుమార్ సమర్పణలో భూషణ్ కుమార్, విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలకానుంది. ఈ సినిమా చివరి దశ పనుల్లో ఉండగానే ఇంకో అవకాశం దక్కించుకున్నారు అశోక్.

అయితే ఇది ఒక ప్రత్యేకమైన, ప్రయోగాత్మకమైన ప్రాజెక్ట్. పూర్తిగా మూకీ సినిమా. అంటే నటనే తప్ప డైలాగ్స్ ఉండవు. అంటే గతంలో కమల్ హాసన్ చేసిన ‘పుష్పక విమానం’ తరహాలో ఉంటుందన్న మాట చిత్రం. అందుకే సినిమాకు ‘ఉఫ్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారట. సోహమ్‌ షా, నుష్రత్, ఓంకార్‌ కపూర్, నోరా ఫతేహీ ముఖ్య పాత్రల్లో నటించనున్నారని తెలుస్తోంది. ఇది కూడ ఒక ప్రముఖ ఓటీటీ కోసం రూపొందిస్తున్న సినిమా అని తెలుస్తోంది. మరి ఇది కేవలం హిందీలోనే ఉంటుందా లేకపోతే దక్షిణాది భాషల్లోకి కూడ డబ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More