31 రోజుల్లో షూటింగ్ ముంగించేసిన దర్శకుడు !
Published on Mar 22, 2017 11:25 am IST


పోయిన సంవత్సరం ‘జెంటిల్మెన్’ చిత్రంతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ యేడాది ‘అమీ తుమీ’ అనే చిత్రం చేస్తునం సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగును మోహన్ కృష్ణ అత్యంత వేగంగా పూర్తి చేశారు. కేవలం 31 రోజుల్లో ఏ చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్నే ఆయన తెలుపుతూ ‘నేను అత్యంత వేగంగా పూర్తి చేసిన సినిమాలో ఇది రెండవది, 31 రోజుల్లో షూట్ చేశాం.

నాకు సహాయపడిన నా టీమ్ కు కృతజ్ఞతలు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఇతర పనులు చేయాల్సివుంది’ అన్నారు. మోహన్ కృష్ణ మొదట్లో నాగ్ చైతన్యతో సినిమా చేయాలని అనుకున్నప్పటికీ చైతన్య కోసం కొద్దీ కలాం వెయిట్ చేయాల్సి ఉండటం వలన ఈ సినిమాని పట్టాలెక్కించారు. శ్రీనివాస్ అవసరాల, అడివి శేష్, వెన్నెల కిశోర్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఈషా, అదితి మాయకల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై కెసి నరసింహారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

 
Like us on Facebook