తెలుగు దర్శకుల సంఘం చేయూత.

Published on Mar 24, 2020 7:12 pm IST

కరోనా వైరస్ వ్యాప్తి చిత్ర పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. ముఖ్యంగా ఈ పరిశ్రమపై ఆధారపడిన చాల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయారు. చిత్రాల షూటింగ్స్, మరియు విడుదల నిలిపివేయడం వలన వారు ఆర్థికంగా నష్టపోస్తున్నారు. ఉపాధి లేకపోవడం వలన కొందరు నిత్యవసర వస్తువులు కూడా కొనుక్కోలేని పరిస్థితి. దీనితో తమ వంతు సాయంగా తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు ముందుకు వచ్చారు.

ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, నిత్యావసర వస్తువులను కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న సభ్యులకు అండగా నిలవాలని తెలుగు దర్శకుల సంఘం నిర్ణయించుకుంది. అలాగే వారి వివరాలను కూడా సేకరిస్తుంది. ఏప్రిల్ మొదటి వారం నుండే ఈ సేవలు అందించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్ ప్రకటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :

X
More