అజిత్‌కు విలన్‌గా తెలుగు హీరో కన్ఫర్మ్

Published on Feb 17, 2020 7:51 am IST

తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం ‘వాలిమై’ సినిమా చేస్తున్నారు. ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా తెలుగు యువ హీరో కార్తికేయ నటిస్తాడని గతంలో వార్తలు రాగా అవి వాస్తవం కాదని తమిళ సినీ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ తర్వాత మరొక తెలుగు నటుడు నవదీప్ పేరు తెరపైకి వచ్చినా అధికారిక ప్రకటన రాలేదు.

అయితే తాజాగా ఇందులో విలన్ తెలుగు హీరో అని కన్ఫర్మ్. అయితే ఆ హీరో కార్తికేయనా, నవదీపా, లేకపోతే వేరే ఎవరైనానా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇందులో అజిత్ సరసన హుమా ఖురేషి కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ 2020 వేసవికి విడుదలకానుంది. అజిత్ గత చిత్రం ‘నెర్కొండ పారవై’ను డైరెక్ట్ చేసిన హెచ్.వినోత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More