తెలుగు ఇండస్ట్రీ మేనేజర్స్ యూనియన్ ఎన్నికల రిజల్ట్ !

Published on Nov 11, 2019 6:40 pm IST

తెలుగు ఇండస్ట్రీ మేనేజర్స్ యూనియన్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో రికార్డ్ నెలకొల్పిన పాత కమిటీని కాదని, ఈ సారి నూతన ప్యానెల్ ని ఎన్నుకున్నారు. యూనియన్ నుతన అధ్యక్షులుగా జె.సాంబశివరావు సమీప ప్రత్యర్థి అమ్మిరాజ్ పై గెలిపొందారు. కార్యదర్శిగా పి.ఎస్.ఎన్ దొర సమీప ప్రత్యర్థి బందరు బాబి పై గెలిపొందారు. కోశాధి కోశాధికారిగా అక్కినేని శ్రీనివాస్ రావు సమీప ప్రత్యర్థి సతీష్ పై గెలిపొందారు.

గెలిపించిన జె.సాంబశివరావు ప్యానల్
ప్రెసిడెంట్ గా జె.సాంబశివరావు, సెక్రటరీ గా పి.ఎస్.ఎన్ దొర , కోశాధికారిగా అక్కినేని శ్రీనివాస్ రావు ,
ఉపాధ్యక్షులుగా చిన్నారావు ధవళ, జి.హరినాధ్ ,
జాయింట్ సెక్రెటరీలుగా అట్లూరి సురేష్ బాబు, ఎస్.రాజ్ నారాయణ,
ఆర్గనైజింగ్ సెక్రటరీ
సి.హెచ్.నాగ మధు , దామోదర్.ఎం-దాము ,
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా
బెక్కం రవీందర్, దీప్తి మట్ట, డి.రామ బాలాజీ,
పి. అంజయ్య , బాల సుబ్రహ్మణ్యం, వోలేటి రామకృష్ణ ,
కె.శ్రీనివాస్ రాజు , ఎం.శ్రీనివాస్ రావ, రామకృష్ణ తన్నీరు.

సంబంధిత సమాచారం :

More