తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథాచిత్రం ‘సందిగ్ధం’ విడుదలకు సిద్ధమైంది. సంధ్య తిరువీధుల నిర్మించిన ఈ సినిమాను మే 29న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి, నవీన్ రాజ్ సంకరపు ప్రధాన పాత్రలు పోషించారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించి, సినిమాపై ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనుంది. రాబోయే రోజుల్లో ప్రమోషన్స్ వేగవంతం చేసి ప్రేక్షకులకు మరింత చేరువకావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి గౌతమ్ రవి రామ్ సంగీతం సమకూర్చగా, నందన్ కృష్ణ సినిమాటోగ్రఫీ, విశ్వన్ రాజ్. డిఎస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. జీవా కొచెర్ల, చిట్టి బాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెప్పించనున్నారు.


