కార్మికులకు వ్యతిరేకం కాదు – ప్రొడ్యూసర్స్ మీట్‌లో నిర్మాతలు

కార్మికులకు వ్యతిరేకం కాదు – ప్రొడ్యూసర్స్ మీట్‌లో నిర్మాతలు

Published on Aug 15, 2025 8:00 PM IST

TFI

తెలుగు సినిమా పరిశ్రమలో కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తమ వేతనాలు పెంచే వరకు షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు వారు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి పలు దఫాలుగా కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. అయితే, తాజాగా ఈ విషయంపై ప్రొడ్యూసర్స్ మీట్ ఏర్పాటు చేశారు.

ఇందులో మైత్రీ మూవీ మేకర్స్ నుంచి చెర్రీ, నిర్మాత వివేక్ కూచిభొట్ల, రాధా మోహన్ పాల్గొన్నారు. వారు ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాము కార్మికులకు వ్యతిరేకం కాదని చెప్పడానికే మాట్లాడుతున్నామని.. తాను పెట్టిన 4 ప్రతిపాదనలు కార్మికులు అంగీకరిస్తే వేతనాల పెంపుపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.

ఇప్పటికే తాము పెట్టిన ప్రతిపాదనల్లో రెండు ప్రతిపాదనలకు 2022లో కార్మికులు అంగీకరించారని.. మరో రెండు ప్రతిపాదనల దగ్గరే చర్చలు ఆగాయని వారు తెలిపారు. టాలెంట్ ఉన్న వారిని ఎవరినైనా పెట్టుకొనే అవకాశం.. ఫైటర్స్, డాన్సర్స్, రేషియో లేకుండా చూడటం.. అనే రెండింటికి కార్మికులు అంగీకరించారు.

అయితే, మరో రెండు ప్రతిపాదనలు అయిన ఉదయం 6 – సాయంత్రం 6 వరకు ఉన్న కాల్షీట్‌తో పాటు ఉదయం 9 – రాత్రి 9 వరకు కూడా అమలు చేయాలి.. ఆదివారం డబుల్ కాల్షీట్ లేకుండా చూడటం(రెండో ఆదివారం మరియు ప్రభుత్వ ప్రకటించిన సెలవులకు డబుల్ కాల్ షీట్ ఒకే) అనే ప్రతిపాదనలపై చర్చలు సాగుతున్నాయి. అయితే, కార్మికులు కూడా ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకుని తమకు సహకరించాలి వారు ఈ సందర్భంగా కోరారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు