తెలుగు స్టార్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చిన రాష్ట్రపతి
Published on Sep 11, 2015 11:00 am IST

telugu-stars

ప్రస్తుతం భారత ప్రభుత్వం సినీ తారల స్టార్డంని బాగా ఉపయోగించుకొని దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే నిన్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పలువురు తారలకు తన రాష్ట్రపతి భవన్ లో నిన్న స్పెషల్ టీ పార్టీ ఇచ్చాడు. ఈ స్టార్స్ అంతా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్చ భారత్ కార్యక్రమానికి బ్రంద్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్న వారు కావడం విశేషం.

నిన్న రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పబ్లిషర్ మరియు ఫిలిం మేకర్ అయిన రామోజీ రావు, కమల్ హాసన్, సోషల్ సర్వీస్ చేసే అమల అక్కినేని, లక్ష్మీ మంచు, ఫేమస్ హీరోయిన్ తమన్నాలతో పాటు నేషనల్ అవార్డు విన్నర్ అయిన లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి తక్కువ ఖర్చుతో ఎలాంటి డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేయాలి, ఇండియాలోని సిటీ, టౌన్స్, గ్రామాలలో అన్ని రకాల వసతులతో పాటు వాతావరణాన్ని కలుషితం కాకుండా చేసే పనులను మొదలు పెట్టాలని ఆయన పిలుపునిచ్చాడు. ఈ విషయంలో స్టార్స్ అయిన వారు ఎక్కువగా చొరవ తీసుకొని ప్రమోట్ చెయ్యడం, పలు గ్రామాలను దత్తత తీసుకోవడం లాంటివి చెయ్యాలని ఆయన అన్నారు.

 
Like us on Facebook