జూలై లో రానున్న తెనాలి రామకృష్ణ !

Published on May 7, 2019 10:00 am IST

గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఈసారి ఎలాగైనాహిట్ కొట్టాలని మినిమం గ్యారెంటీ డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి తో సినిమా చేస్తున్నాడు. వీరి కాంభినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం తెనాలి రామకృష్ణ బిఏబిఎల్. ఈ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది.

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రం లో సందీప్ కిషన్ లాయర్ గా నటిస్తుండగా ఆయన కు జోడిగా హన్సిక నటిస్తుంది. ఇక ఈ రోజు సందీప్ పుట్టిన రోజు సందర్భంగా ఈచిత్రం నుండి ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు. ఈ ఫస్ట్ లుక్ ఇంట్రస్టింగ్ గా ఉండి సినిమా ఫై అంచనాలను తీసుకొచ్చింది. జూలై లో ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

More