వాళ్లకి మాత్రం ముందే సినిమా చూపిస్తానంటున్న సందీప్ కిషన్

Published on Nov 11, 2019 5:49 pm IST

ఇటీవలే ‘నిను వీడని నీడను నేనే’తో విజయం సాధించిన సందీప్ కిషన్ చేసిన కొత్త చిత్రం ‘తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్’. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిందిన ఈ చిత్రం నవంబర్ 15న విడుదలకానుంది. మిగతా ప్రాంతాల ప్రజలు 15నాడే సినిమాను చూస్తారు కానీ అయితే క‌ర్నూలు, తెనాలి ప్రాంతాల్లోని ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఒక‌రోజు ముందుగానే వీక్షించనున్నారు.

అందుకు కారణం సినిమా ఎక్కువగా తెనాలి, కర్నూల్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోవడమే. షూటింగ్ సమయంలో అక్కడి స్థానికులు చిత్ర బృందానికి అన్ని విధాలా సహకరించారట.
అందుకే కృతజ్ఞతగా ఆ ప్రాంతాల్లో ప్రజలకు 14వ తేదీన స్పెషల్ ప్రీనియర్స్ వేయనున్నారట. హ‌న్సిక కథానాయకిగా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. అగ్రహారం నాగి రెడ్డి, సంజీవరెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More