తెనాలి రామకృష్ణ ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగిందే..!

Published on Nov 14, 2019 8:59 pm IST

సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ గా రేపటి నుండి థియేటర్లలో సందడి చేయనున్నాడు. కేసులు లేని కుర్ర లాయర్ గా సందీప్ నటిస్తుండగా కామెడీ చిత్రాల దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి తెరకెక్కించారు. సందీప్ కిషన్ లేటెస్ట్ గా ‘నిను వీడని నీడను నేను’ అనే హారర్ మూవీతో హిట్ అందుకున్నారు. దీనితో తాజా చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. అలాగే తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయిందని సమాచారం.

ఈ చిత్రం థియరిటికల్, శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ కి గానూ ఏకంగా 7కోట్లు దక్కాయని తెలుస్తుంది. సందీప్ మార్కెట్ దృష్ట్యా ఈ చిత్రం గట్టిగానే బిజినెస్ చేసింది అని చెప్పొచ్చు. ఇక బ్యూటీ హన్సిక మోత్వానీ సందీప్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె కూడా ఈచిత్రంలో లాయర్ కావడం విశేషం. అగ్రహారం నాగి రెడ్డి, కె సంజీవ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More