యంగ్ సెన్సేషన్ థమన్ ప్రతి సినిమాలో తన పాటలతో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ హాట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన మారిపోయాడు. అరడజనుకు పైగా ప్రాజెక్ట్స్ ఇప్పుడు అతని చేతిలో ఉన్నాయి. ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న చిత్రం ప్రతిరోజూ పండుగే. ఈచిత్రంలోని తకిట తకిట సాంగ్ నేడు విడుదల చేశారు. దేశీ బీట్ లో నాన్ స్టాప్ గా సాగిన ఆ సాంగ్ ప్రేక్షకులలో జోష్ నింపేదిలా ఉంది. ఓ పుట్టిన రోజు పార్టీ వేడుకను కుటుంబ సభ్యులు, అతిధులు, స్నేహితుల మధ్యలో జరుపుకుంటున్న సంధర్భంలో వచ్చే ఆ సాంగ్ పర్ఫెక్ట్ గా ఉంది.
బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగింజ్ పాడిన ఈ పాట యూత్ ని ఉపేయడం ఖాయంగా కనిపిస్తుంది. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తుంది. పల్లెటూరి నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.
వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


