నెవర్ బిఫోర్ ఓపెనింగ్స్ తో “మాస్టర్”..అన్ని చోట్లా ఇదేనా.?

Published on Jan 13, 2021 3:05 pm IST

ఇళయ థలపతి విజయ్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ గా టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ దర్శకత్వంలో తెరకెక్కించిన హై అండ్ యాక్షన్ డ్రామా “మాస్టర్”. నిజానికి ఎపుడో విడుదల కావాల్సిన ఈ భారీ చిత్రం ఎట్టకేలకు ఈ సంక్రానీహి బరిలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. చాలా కాలం గ్యాప్ తర్వాత విజయ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో మోస్ట్ అవైటెడ్ సినిమాగా ఇది నిలిచింది.

మరి ఇంతకు ముందు ఎన్నడు లేని విడుదల ఈ చిత్రానికి దక్కిన నేపథ్యంలో మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లనే ఈ చిత్రం కొల్లగొట్టేస్తుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ లో అయితే నెవర్ బిఫోర్ రికార్డులే అని చెప్తున్నారు. థలపతి ఖచ్చితంగా ఇంతకు ముందు ఉన్న రికార్డులు అన్నీ తుడిచేస్తాడని తెలుస్తుంది.

కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ తో కూడా విజయ్ భారీ వసూళ్లు రాబట్టనున్నాడని అంటున్నారు. అంతే కాకుండా ముంబై, ఢిల్లీ వంటి ప్రణతాల్లో కూడా ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడడం గమనార్హం. దీనితో మొత్తం దేశ వ్యాప్తంగా మాస్టర్ స్ట్రామ్ గట్టిగానే ఉంటుంది అని తెలుస్తుంది. మరి ఈ చిత్రానికి మొదటి రోజు ఫిగర్స్ ఏ రేంజ్ లో వస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం :