సెల్ఫీతోనే ఇండియన్ రికార్డ్ సెట్ చేసిన థలపతి.!

Published on Sep 18, 2020 8:57 am IST

కోలీవుడ్ లో ఇళయ థలపతి విజయ్ కు ఉన్న క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో మన తెలుగు ఆడియెన్స్ కూడా తెలిసిందే. సోషల్ మీడియా వినియోగికం తక్కువగా ఉండే వారికి ఏమో కానీ ఎక్కువగా వినియోగించే వారికి మాత్రం విజయ్ క్రేజ్ కోసం తప్పకుండా తెలిసే ఉంటుంది. అయితే థలపతి విజయ్ సోషల్ మీడియాలో ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువగానే వినియోగిస్తారు.

కానీ ఆ తక్కువలోనే వచ్చే రీచ్ మాత్రం దారుణమైన స్పీడ్ తో భారీగా ఉంటుంది. విజయ్ తన ట్విట్టర్ ఖాతా నుంచి ఒక ట్వీట్ పెడితే చాలు గంటల్లోనే లక్షలాది లైకులు మరియు రీట్వీట్లు అభిమానులు ఇచ్చేస్తారు. ఈ రేంజ్ రీచ్ ఏంటో ఇప్పటికీ చాలా మందికి అర్ధం కాదు. ఇపుడు అదే స్పీడ్ విజయ్ పెట్టిన ఒక సెల్ఫీ ట్వీట్ ను ఇండియాలోనే హైయెస్ట్ రీట్వీటెడ్ ట్వీట్ గా మార్చేసి రికార్డు నెలకొల్పింది.

విజయ్ ఇప్పుడు నటిస్తున్న “మాస్టర్” షూట్ లో భాగంగా లొకేషన్ వద్దకు వెళ్లగా అక్కడ వేలాది మంది అభిమానులు గుమిగూడార్రు. వారితో తీసుకున్న సెల్ఫీనే విజయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా గత ఫిబ్రవరిలో షేర్ చెయ్యగా దానికి ఇప్పటికి 3 లక్షల 58 వేల లైక్స్ మరియు ఒక లక్ష 30వేలకు పైగా రీట్వీట్స్ రావడంతో మన ఇండియాలోనే రికార్డు ట్వీట్ ఏ సెలెబ్రెటీకి కూడా లేని ట్వీట్ గా నిలిచింది అని అన్ని సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం :