చరణ్, శంకర్ ల ప్రాజెక్ట్ కి మొదటి పాటే మరో లెవెల్లో ప్లాన్.!

Published on Jul 20, 2021 7:01 am IST

ప్రస్తుతం మన దక్షిణాది నుంచి భారీ ఎత్తున అంచనాలతో పాన్ ఇండియన్ లెవెల్లో అంచనాలు నెలకొల్పుకున్న పలు సెన్సేషనల్ కాంబోలలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు విజనరీ డైరెక్టర్ శంకర్ ల కాంబోలో ప్లాన్ చేసిన బెంచ్ మార్క్ సినిమా కూడా ఒకటి. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక్కో అధికారిక అప్డేట్ ఒక్కోరోజు బయటకి వస్తుంది.

మరి అలా నిన్ననే ఈ సినిమాకు మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ ఎస్ కన్ఫర్మ్ అయ్యాడని తెలిసింది. అయితే ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ అప్డేట్ కూడా తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ ఇంట్రో సాంగ్ ఆల్రెడీ కంపోజ్ అయ్యిపోయిందట. అలాగే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మొత్తం 135 మంది సంగీత విద్వాంసులు ఈ పాటకి వర్క్ చేశారు అని ఇండస్ట్రీలో నయా టాక్.. దీనితో ఈ సినిమాలో మొదటి పాటే మరో లెవెల్లో తెరకెక్కింది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా ఇతర క్యాస్టింగ్ పై మరింత సమాచారం రావాల్సి ఉంది..

సంబంధిత సమాచారం :