మరో క్రేజీ ఆఫర్ ను పట్టేసిన తమన్ !

Published on May 5, 2019 11:12 am IST

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కెరీర్ ప్రస్తుతం పిక్స్ స్టేజి లో ఉంది. ఏడాదికి 6నుండి 7 సినిమాలకు మ్యూజిక్ చేస్తూ ఫుల్ బిజీగా వున్నాడు. ఇక ఈ ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్ వచ్చింది.

స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం సూర్యవంశీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రోహిత్ శెట్టి , తమన్ కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా. ఇంతకుముందు రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన గోల్ మాల్ 4, సింబా చిత్రాలకు తమన్ సంగీతం అందించాడు. మరి ఈ చిత్రం తో తమన్ బాలీవుడ్ లో కూడా బిజీ అవుతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More