‘డిస్కో రాజా’ కోసం పెద్ద ప్రయత్నమే చేసిన తమన్

Published on Jan 16, 2020 12:00 am IST

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ డైరెక్షన్లో ‘డిస్కో రాజా’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై రవితేజ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయన అభిమానులు సైతం ఈ చిత్రం ద్వారా తమ హీరో పూర్వపు ఫామ్లోకి వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. జనవరి 24న సినిమా విడుడలకానుండటంతో చిత్ర టీమ్ సన్నాహాలు మొదలుపెట్టింది.

ఇప్పటికే రెండు టీజర్లను విడుదల చేసి ఇప్పుడు ఒక పాటను సిద్దం చేసింది. ‘రమ్ పమ్ బమ్’ అనే ఈ
పాటను ప్రముఖ గాయకుడు బప్పీ లహరి చేత పాడించారు సంగీత దర్శకుడు తమన్. గతంలో తెలుగులో అనేక సూపర్ హిట్ పాటలు పాడిన బప్పీ లహరి లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో పాడిన పాట ఇదే కావడం విశేషం. ఇలా ఒక పాట కోసం బప్పీ లహరిని ఛాన్నాళ్ళ తర్వాత మళ్లీ తెలుగులోకి తీసుకురావడం తమన్ చేసిన పెద్ద ప్రయత్నమనే అనాలి. ఈ పాటను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :