షాక్ లో వచ్చిన షేక్…సూపర్ స్టార్ డాన్స్ పై థమన్ కామెంట్స్!

Published on May 17, 2022 8:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సర్కారు వారి పాట మ మ మాస్ సెలబ్రేషన్స్ సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. ఈ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అంతేకాక ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మ మ మహేషా సాంగ్ కి స్టేజ్ పై స్టెప్పులు వేయడం జరిగింది. స్టేజ్ పై ఉన్న మ్యూజికల్ సెన్సేషన్ థమన్ కూడా మహేష్ తో డాన్స్ వేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

సూపర్ స్టార్ డాన్స్ పై సోషల్ మీడియా ద్వారా థమన్ కామెంట్స్ చేయడం జరిగింది. వాటే మూమెంట్ లైఫ్ కి, ఇంకా అదే షాక్ లో ఉన్న నేనైతే, షాక్ లో వచ్చిన షేక్ అంటూ థమన్ మహేష్ తో ఉన్న ఫోటో ను షేర్ చేశారు. ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, నదియా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సముద్ర ఖని, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :