“సర్కారు వారి పాట”లో స్పెషల్ సాంగ్ పై థమన్ లేటెస్ట్ అప్డేట్.!

Published on May 10, 2022 2:20 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్ లో మంచి మోస్ట్ అవైటెడ్ సినిమాగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. అయితే ఈ సినిమా ఆల్ మోస్ట్ సిద్ధం అయ్యిపోయి థియేటర్స్ లో పడటానికి రెడీగా ఉండగా మేకర్స్ లాస్ట్ టైం తమ టీం తో మెరుగులు దిద్దుతున్నారు.

వాటిలో భాగంగానే సంగీత దర్శకుడు థమన్ డాల్బీ సౌండ్ సిస్టం లాస్ట్ చెకింగ్ లో ఉన్నట్టుగా ఒక ఫోటో ని తన సోషల్ మీడియా ద్వారా తన టీం తో కలిసి ఉన్నట్టుగా తెలిపారు. అలాగే సినిమాలోని ర్యాప్ సాంగ్ కి కూడా అంతా సిద్ధం చేసినట్టు తెలిపి ఇంకో క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. మరి ఇది తనకి నచ్చిన కొన్ని ఇష్టమైన సీన్స్ తో కలిపి ఈ సాంగ్ ని సిద్ధం చేసానని అంతా హై వాల్యూమ్ పెట్టుకొని రెడీగా ఉండండి అని సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. మరి ఈ స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :