మెగాస్టార్ “లూసిఫర్” పై ఎగ్జైటెడ్ గా ఉన్న థమన్.!

Published on Jan 20, 2021 1:00 pm IST

ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది థమన్ అనే చెప్పాలి. ఒక్కప్పుడు అంటే ఏమో కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ,మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన “అరవింద సమేత” నుంచి కొత్త థమన్ పరిచయం అయ్యాడని చెప్పాలి.

అక్కడ నుంచి తర్వాత చేసిన “అల వైకుంఠపురములో” లేటెస్ట్ గా “క్రాక్” వరకు తనదైన ఫ్రెష్ సాంగ్స్ మరియు ఎక్స్ట్రార్డినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను ఇస్తూ మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలిచాడు. మరి ఇప్పుడు ఈ సంగీత దర్శకుడు ఇప్పుడు మెగా ఫోన్ పట్టాడు.

మొట్ట మొదటి సారిగా ఫుల్ లెంగ్త్ లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చెయ్యడానికి ఫిక్స్ అయ్యాడు. మరి దీనిపై థమన్ చాలా ఎగ్జైట్ అయ్యి ఆ ఆనందాన్ని కూడా పంచుకున్నాడు. ఇది ఏ కంపోజర్ కు అయినా సరే ఇది ఒక పెద్ద డ్రీం లాంటిది అని ఇప్పుడు బాస్ మీద ప్రేమ చూపేందుకు నా టర్న్ వచ్చింది అని..

తనకు చేయబోయే “లూసిఫర్” రీమేక్ ను అనౌన్స్ చేసేసాడు. మరి ఈ సందర్భంగా మెగాస్టార్ కు అలాగే దర్శకుడు మోహన్ రాజా కు తన థాంక్స్ తెలిపాడు. అయితే ఇంతకు ముందే మెగాస్టార్ కు “బ్రూస్ లీ”లో ఒక మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More