లేటెస్ట్..”మహేష్ 28″ పై అదిరే క్లారిటీ ఇచ్చిన థమన్.!

లేటెస్ట్..”మహేష్ 28″ పై అదిరే క్లారిటీ ఇచ్చిన థమన్.!

Published on Nov 23, 2022 5:06 PM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న హ్యాట్రిక్ సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తుండగా గత కొన్ని రోజులు కితం అయితే ఈ సినిమాపై పలు గాసిప్స్ కూడా వినిపించాయి.

అలా వాటిలో సంగీత దర్శకుడు థమన్ విషయంలో కూడా కొన్ని వార్తలు వినిపించాయి. థమన్ ని అయితే సినిమా నుంచి తప్పిస్తున్నారని కొత్త పేరు బయటకు రావచ్చని కొన్ని ఊహాగానాలు అయితే వస్తున్నాయి. కానీ ఇప్పుడు వీటి అన్నిటికి చెక్ పెడుతూ థమన్ సాలిడ్ క్లారిటీ ఇచ్చాడు.

నిన్న థమన్ బర్త్ డే కాగా ఈరోజు తమ నిర్మాత నాగవంశీ విషెష్ చెప్తూ మహేష్ 28 కి ఇచ్చే మార్వలెస్ ట్యూన్స్ కోసం ఎదురు చూస్తున్నానని తెలియజేసారు. అయితే దీనితో రిప్లై ఇస్తూ థమన్ ఖచ్చితంగా మహేష్ సినిమాకి అదరగొడదామని కన్ఫర్మ్ చేసేసాడు. దీనితో అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఉన్న రూమర్స్ పై అందరికీ ఓ క్లారిటీ వచ్చేసినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు