ఈ సారి నానికి కూడా ఆయనే కావాలట..!

ఈ సారి నానికి కూడా ఆయనే కావాలట..!

Published on Dec 4, 2019 8:57 PM IST

నాని సినిమాల వరుస చూస్తుంటే ఆయన ఎంత విభిన్నంగా సినిమాలు ప్రయత్నిస్తున్నారో అర్థం అవుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో జెర్సీ అనే ఎమోషనల్ ఎంటర్టైనర్ లో నటించిన ఆయన ఆ తరువాత గ్యాంగ్ లీడర్ అనే కామెడీ క్రైమ్ థ్రిల్లర్ లో నటించారు. ఇక మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘వి’ క్రైమ్ థ్రిల్లర్ కాగా నెగెటివ్ షేడ్స్ కలిగిన సీరియల్ కిల్లర్ గా నాని కనిపిస్తారని వినికిడి. ఇలా వరుసగా వైవిధ్యం ఉన్న చిత్రాలు చేస్తున్న నాని తాజాగా ‘టక్ జగదీష్’ అనే డిఫరెంట్ టైటిల్ తో మూవీ ప్రకటించి ఆశ్చర్య పరిచారు.

గతంలో ఆయనతో నిన్ను కోరి వంటి హిట్ మూవీ తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ని తీసుకోవాలని భావిస్తున్నారట. ఇంత వరకు థమన్, నాని కలిసిపనిచేసింది లేదు. అలాగే ప్రస్తుతం థమన్ ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. టాలీవుడ్ లో పేరున్న ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఆయనే సంగీతం అందిస్తున్నారు. దీనితో థమన్ ని ఈ మూవీ కొరకు తీసుకోవాలని దర్శక నిర్మాతలు మరియు నాని భావిస్తున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు