బన్నీ కోసం కొత్త సౌండింగ్ !

Published on May 26, 2019 9:31 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా థమన్ ఈ సినిమా కోసం ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రాంరభించాడు. ఆల్ రెడీ రెండు ట్యూన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. బన్నీ డాన్స్ మూమెంట్స్ కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయట. పైగా థమన్ ఇచ్చిన ట్యూన్స్ లో సౌండింగ్ చాలా కొత్తగా ఉందని.. ఈ సినిమా ఆల్బమ్ తమన్ కెరీర్ లో మరో సూపర్ హిట్ ఆల్బమ్ గా నిలిచిపోవటం ఖాయమని అంటుంది చిత్రబృందం.

ఇక ఈ సినిమలో బన్నీసరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే త్రివిక్రమ్ తో ‘అరవింద సమేత’కి, అలాగే బన్నీతో డీజే సినిమాకి పనిచేసింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్, నవదీప్ లు కూడా నటిస్తున్నారు. అన్నిటికి మించి ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి తల్లిగా ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు నటిస్తోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి చినబాబు నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

More