మెగా రీమేక్‌కు తమన్ మొదలెట్టేశాడుగా..!

Published on Jul 26, 2021 11:31 pm IST

మెగస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మళయాళంలో సూపర్ హిట్టైన “లూసిఫర్” సినిమా రీమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్ ఆగస్టు 12 నుంచి మొదలు కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న తమన్ తన పనిని మొదలెట్టేశాడు. ఈ రీమేక్‌కి రికార్డింగ్ పనులు స్టార్ట్ చేసినట్టు తమన్ ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు.

అయితే నా జీవితంలో ఇది అద్భుతమైన రోజు అని, నా కల నెరవేరబోతోందని అన్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి గారి సినిమాకు మొదటి పాట రికార్డు చేయబోతున్నట్టు, ఇందుకోసం లండన్‌లోని అబ్బేరోడ్ స్టూడియోలో పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే ఇది వేడుక చేసుకోవాల్సిన సమయం అంటూ తమన్‌ ట్వీట్‌ చేశాడు.

సంబంధిత సమాచారం :