మెగాస్టార్ ‘మా’ను ముందుండి నడపాలట !

Published on Jan 4, 2020 2:06 am IST

హీరో రాజశేఖర్ మా అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ వేదికగా మీడియా ముందు మా అసోసియేషన్ లో జరుగుతున్న పరిణామాల పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణం రాజు వంటి వారు వేదిక పై ఉండగా రాజశేఖర్ అలా ప్రవర్తించిన తీరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిన సంగతి కూడా తెలిసిందే. పైగా రాజ‌శేఖ‌ర్ ప్ర‌వ‌ర్త‌న‌ పై చిరంజీవితో పాటు కృష్ణంరాజు, మోహ‌న్‌బాబు, ముర‌ళీమోహ‌న్ లాంటి సీనియర్ నటులు కూడా రాజ‌శేఖ‌ర్ తీరుని త‌ప్పు పట్టారు.

అయితే రాజశేఖర్ ప్రవర్తన పై తాజాగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్పందించారు. ‘మా’లో కేవలం ఆధిప‌త్యం కోస‌మే ఇలాంటి గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయని, అయితే ఇప్పుడు పెద్ద‌ల ముందు ఇలాంటివి బ‌య‌టప‌డ‌టంతో ఇకనుండైనా అన్ని గొడవలు స‌మ‌సిపోతాయ‌ని నేను భావిస్తున్నాన‌ని భ‌ర‌ద్వాజ తెలిపారు. అలాగే ఇక నుండి మెగాస్టార్ చిరంజీవినే ముందుండి మా అసోసియేష‌న్ ను ముందుకు న‌డిపించాల‌ని భ‌ర‌ద్వాజ కోరారు. ఇప్పటికే అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పదవికి హీరో రాజశేఖర్ రాజీనామా చేశారు.

సంబంధిత సమాచారం :