లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకం పై కిషన్ సాగర్ దర్శకత్వం లో అల్లూరి సూర్యప్రసాద్ మరియు సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన ప్రేమ కథా చిత్రం మౌనం. ఎమ్.ఎమ్.శ్రీలేఖ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మల్లెపువ్వు ఫేమ్ మురళి, భానుశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. మణిరత్నం మౌనరాగం తరహాలో రూపొందిన మౌనం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ఊర్వశి ఓటిటి సీఈఓ రామ్ తుమ్మలపల్లి ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. ఈ నెలాఖరుకు లేదా సెప్టెంబర్ ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లూరి సూర్యప్రసాద్ సంధ్య రవి మాట్లాడుతూ, పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మౌనం కూడా కొన్ని సందర్భాల్లో ఎంత శక్తివంతంగా ఉంటుందో చాలా సెన్సిబిల్ గా చూపించే చిత్రం మౌనం అని, ఈనెలాఖరుకు కానీ, సెప్టెంబర్ ఫస్ట్ హాఫ్ లో కానీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మౌనం ట్రైలర్ విడుదల చేసిన తమ్మారెడ్డి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు. ఈ చిత్రానికి కిషన్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు.


