చైతు.. మ‌రో గిఫ్ట్‌ ను రెడీ చేసుకో !

Published on Feb 16, 2020 12:05 am IST

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి వాలంటైన్స్ డే స్పెషల్ గా విడుదల చేసిన ‘ఏయ్ పిల్లా’ మ్యూజికల్ ప్రివ్యూ (1 మినిట్ వీడియో సాంగ్) కు మంచి రెస్సాన్స్ వస్తుంది. ఫస్ట్ కిస్ ఫీలింగ్ ని నాగచైతన్య పలకించిన నటన మంచి రెస్సాన్స్ వస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో ప్రివ్యూ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటంతో.. నాగచైత‌న్య శేఖర్ కమ్ములకు ఓ ఖ‌రీదైన గిఫ్ట్‌గా ఇచ్చాడు.

ఈ గిప్ట్ గురించి శేఖర్ కమ్ముల ట్వీట్ చేస్తూ.. ‘స్పెష‌ల్ గిఫ్ట్ అందించినందుకు థాంక్స్‌. ఈ గిఫ్ట్‌తో నన్ను ట‌చ్ చేశావ్‌.. నెట్స్ టీజ‌ర్‌కి మ‌రో గిఫ్ట్‌ను రెడీ చేసుకో అని శేఖ‌ర్ క‌మ్ముల పోస్ట్ చేశారు. కాగా ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

సెన్సిబుల్ లవ్ స్టోరీస్ ని బలంగా ప్రజెంట్ చేయడంలో మాస్టర్ అయిన శేఖర్ కమ్ముల తెరమీద కురిపించబోతున్న ఈ ప్రేమలో తడిచేందుకు ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేసింది ఈ సాంగ్. ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది. ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ‘లవ్ స్టోరీ’సమ్మర్ లో విడుదలకు సిద్దం అవుతుంది.

సంబంధిత సమాచారం :

X
More