ఎన్టీఆర్, చరణ్ లమధ్య భీకర పోరు..!

Published on Mar 29, 2020 9:01 am IST

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ రూపంలో మరో విజువల్ వండర్ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. కొద్దిరోజుల వ్యవధిలో రెండు ఊహించని ట్రీట్స్ రాజమౌళి ఇవ్వడం జరిగింది. టైటిల్ లోగో మోషన్ పోస్టర్ తోనే దుమ్మురేపిన రాజమౌళి భీమ్ ఫర్ రామరాజు వీడియోలో సినిమాపై అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఇక ఎన్టీఆర్ తెలంగాణా యాసతో కూడిన వాయిస్ ఓవర్ చరణ్ పాత్రను అద్భుతంగా ఎలివేట్ చేయగా, చరణ్ కసిగా కండల బాడీతో విజృభించాడు.

కాగా ఆర్ ఆర్ ఆర్ గురించిన మరో వార్త ఆసక్తి రేపుతోంది. రెండు భిన్న ప్రాంతాలకు చెందిన భీమ్ మరియు సీతారామరాజు మొదటిసారి ఎదురుపడిన సందర్భంలో భీకర పోరు నడుస్తుందట. వీరి మధ్య జరిగే ముఖాముఖి పోరును రాజమౌళి భారీ ఎత్తున విజువల్ వండర్ గా తీర్చిదిద్దాడట. పది నిమిషాలకు పైగా జరిగే ఫైట్ లో ఎన్టీఆర్, చరణ్ నువ్వా నేనా అన్నట్లు తలపడతారని సమాచారం. మరి ఈ వార్త వింటుంటేనే గూస్ బంప్స్ కలుగుతున్నాయి కదూ.

సంబంధిత సమాచారం :

X
More