పులి ఫైట్ లో ఎన్టీఆర్ మెరుపు వేగం మైండ్ బ్లోయింగ్ అట..!

Published on Jul 8, 2020 9:09 am IST

రాజమౌళి డైరెక్షన్, ఎన్టీఆర్ చరణ్ ల మల్టీస్టారర్, భారీ బడ్జెట్, బాలీవుడ్ హాలీవుడ్ తారలు లాంటి అనేక ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మరింత లేటు కావడం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. ఈ విజువల్ వండర్ ని త్వరగా బిగ్ స్క్రీన్ పై చూసేయాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆరాటపడుతున్నారు. రాజమౌళి వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ ల వీరోచిత పోరాటాలు, అద్భుత సన్నివేశాలతో సాగే ఆర్ ఆర్ ఆర్ కొరకు దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ ఓ సన్నివేశంలో పులితో తలపడతాడు. ఆ సన్నివేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలు…వీడియో క్లిప్ లు చాలా రోజుల క్రితం బయటికి రావడం జరిగింది. ఈ ఫైట్ లో చొక్కాలేకుండా గాయాలతో పులితో తపడుతున్న ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రేపింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ పులి ఫైట్ సన్నివేశంలో ఎన్టీఆర్ మెరుపు వేగం మెస్మరైజ్ చేస్తుందట. దాదాపు ఐదు నిమిషాలకు పైగా సాగే పోరులో నువ్వా నేనా అన్నట్లు ఎన్టీఆర్ పులితో తలపడతాడట. ఈ సన్నివేశం సినిమాకే హైలెట్ అంటున్నారు. ఇక రాజమౌళి బాహుబలి సినిమాలో రానా అడవి దున్నతో పోటీ పడే సన్నివేశం తెరకెక్కించగా, సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది.

సంబంధిత సమాచారం :

More