ప్రభాస్ వింటేజ్ లవర్ బాయ్ లుక్ ఎలా ఉంటుందో?

Published on Jul 9, 2020 3:00 am IST


జులై 10న 10:10 నిమిషాలకు ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకోనున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ ప్రభాస్ 20నుండి ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఇక ఈ మూవీ 1960 ల కాలం నాటి పీరియాడిక్ లవ్ స్టోరీ అని తెలుస్తుండగా ఆయన లుక్ పై ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. పీరియాడిక్ మూవీ కాబట్టి అది కూడా 1960ల కాలం అంటున్నారు కాబట్టి ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించనున్నాడని అర్థం అవుతుంది. మరి అలనాటి లవర్ బాయ్ గా ప్రభాస్ ఎలా ఉంటాడు అనేది ఆసక్తి రేపుతోంది.

ఇక ఈ మూవీలో పూజ హెగ్డే మొదటిసారి ప్రభాస్ కి జంటగా నటిస్తుంది. కాగా బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఈ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తుండగా యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. నాలుగు భాషలలో ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఇక మార్నింగ్ నుండి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ 20ని ట్రెండ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More