మహేష్ మూవీలో అసలు ట్విస్ట్ అదే…!

Published on Oct 12, 2019 10:24 am IST

మహేష్ సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ షెడ్యూల్ గ్యాప్ లో కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్ కొరకు విదేశాలకు వెళ్లారు. వారం రోజులకు పైగా కుటుంబంతో వెకేషన్ ఎంజాయ్ చేసిన మహేష్ తిరిగి ఇండియా చేరారు. దీనితో ఆయన త్వరలో మొదలు కానున్న తదుపరి షెడ్యూల్ కొరకు సిద్దమవుతున్నారట. గత షెడ్యూల్ నందు కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ లో కీలక పోరాట సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడనేది తెలియాల్సివుంది.

దసరా కానుకగా మహేష్ గొడ్డలిపెట్టుకొని ఉన్న పోస్టర్ ని విడుదల చేశారు. బోర్డర్ లో గన్ చేతపట్టి దేశానికి కాపలాకాసిన మేజర్ అజయ్ కృష్ణ, కర్నూల్ లో గొడ్డలిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది అసలు ట్విస్ట్. కథలో కూడా ఇదే కీలకమైన పాయింట్ గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడట. విడుదలైన తాజా పోస్టర్ లోని లుక్ తో సరిలేరు నీకెవ్వరూ మూవీలో ఫ్యాక్షన్ ఛాయలు ఉంటాయని అర్థం అవుతుంది. ఫ్యాక్షనిస్ట్, మేజర్ పాత్రలు చేస్తున్న మహేష్ తో అనిల్ రావిపూడి కామెడీ ఎలా చేయించాడనేది ఆసక్తికరం.

దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రశ్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, విజయశాంతి కీలకపాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈచిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More