ఫస్ట్ డే ఫస్ట్ షో ఉచితం అందుకే – చేతన్ మద్దినేని

Published on Nov 19, 2019 10:54 am IST

రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు వంటి భిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రాలలో నటించిన చేతన్ మద్దినేని నటించిన తాజా చిత్రం ‘బీచ్ రోడ్ చేతన్’. ఈనెల 22న రెండున విడుదల అవుతున్న ఈచిత్రాన్ని చేతన్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించడం విశేషం. కాగా చేతన్ ఈమూవీ తానే నిర్మించి దర్శకత్వం వహించాడిని కారణం..,తనను తాను ఒక కంప్లీట్ హీరోగా ఆవిష్కరించుకోవడానికే అని చెప్పారు. గతంలో తాను చేసిన సినిమాలలో తన పాత్ర సాఫ్ట్ గా ఉండటం వలన దర్శకులు తనని అదేకోణంలో చూస్తున్నారని, అందుకే ఈ చిత్రంలో యాక్షన్, లవ్, ఎమోషన్స్ అన్ని ట్రై చేశాను అన్నారు.

సినిమాలపై చిన్నప్పటినుండి మక్కువ అన్న చేతన్, తన పేరెంట్స్ తన అభిరుచి ప్రోత్సహించారు అన్నారు. కథ,స్క్రీన్ ప్లే రాసుకొని స్నేహితుల సహాయంతో ఈ మూవీ నిర్మించాను అన్నారు. జులాయిగా తిరిగే యువకుడికి దొరికిన స్మార్ట్ ఫోన్ అతని జీవితాన్ని ఎలా మార్చివేసింది అన్నదే కథ అన్నారు. చిన్న చిత్రాలకు ప్రేక్షకుల మౌత్ టాక్ చాలా అవసరం అది లేకుండా ప్రచారం కలుగదు. అందుకే ఫస్ట్ డే మార్నింగ్ షో ఉచితంగా ప్రదర్శిస్తున్నాం అన్నారు. మరి చేతన్ మద్దినేని నాలుగవ ప్రయత్నంలోనైనా హిట్ అందుకుంటారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :