సూపర్ స్టార్ మూవీ ట్రైలర్ పై.. అభిమానుల ఆసక్తి !

Published on Oct 28, 2018 11:47 am IST

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా.. టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న 2.ఓ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ సినీ చరిత్రలోనే కనివిని ఎరుగని భారీ బడ్జెక్ట్ తో ఈ చిత్రం రూపొందటం, గ్రాఫిక్స్ కి అత్యంత విలువ ఇస్తూ, అద్భుతమైన విజువల్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో.. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

కాగా తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల తేదీని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. నంవంబర్ 3వ తేదీన ఈ చిత్రం ట్రైలర్ విడుదల కానుంది. అమీ జాక్సన్ కథానాయకిగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఏఅర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు , తమిళ ,హిందీ భాషల్లో నవంబర్ 29న భారీ స్థాయిలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :