కజకిస్తాన్‌ లో షూట్‌ చేస్తోన్న విజయ్‌ ఆంటోనీ !

Published on Nov 21, 2019 1:00 am IST

బిచ్చగాడు’తో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ పొందారు విజయ్‌ ఆంటోనీ. ఆయ‌న‌తో పాటు అరుణ్‌ విజయ్, అక్షరా హాసన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘అగ్ని సిరగుగల్‌’. ఈ సినిమాను తెలుగులో ‘జ్వాల’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు జవ్వాజి రామాంజనేయులు, యం.రాజశేఖర్‌. దాదాపు 25 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కనుండటం విశేషం.

కాగా ఈ సినిమాలో హీరో విజయ్‌ ఆంటోని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. చిత్రీకరణ తుది దశలో ఉంది. ప్రస్తుతం జ్వాల తుది షెడ్యూల్‌ను కజకిస్తాన్‌లో షూట్‌ చేస్తున్నారు. కజకిస్తాన్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న తొలి ఇండియన్‌ సినిమా ఇదే. విజువల్‌ ఫీస్ట్‌గా సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ట్రైలర్, ఆడియో, చిత్ర రిలీజ్‌ వివరాలు తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం :

More