మరో సినిమాను అనౌన్స్ చేసిన కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు

Published on Mar 18, 2022 11:30 pm IST


కాశ్మీర్ ఫైల్స్ చిత్రం దేశంలో ఒక రకమైన సంచలనం సృష్టించింది. ఈ చిత్రం దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది, అంతేకాక ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్ల మార్కును సాధించింది. ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు.

ఇప్పుడు వివేక్ ది ఢిల్లీ ఫైల్స్ అనే కొత్త సినిమాని అనౌన్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కొత్త పరిణామం మరియు ఈ చిత్రంలో అతను ఏ అంశాన్ని కవర్ చేస్తాడో చూడాలి. త్వరలో విడుదల కానున్న బచ్చన్ పాండే మరియు RRR వంటి చిత్రాలకు కాశ్మీర్ ఫైల్స్ గట్టి పోటీనిస్తుంది. మరో సినిమా ప్రకటన తో ఈ చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది.

సంబంధిత సమాచారం :