భారత్ లో 100 కోట్ల వసూళ్లు సాధించిన ‘ది లయన్ కింగ్’.

Published on Jul 26, 2019 6:10 pm IST

ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్ని ప్రతిష్టంగా నిర్మించిన ది లయన్ కింగ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ది లయన్ కింగ్ మూవీ ఈ శుక్రవారానికి ఈ మార్క్ చేరుకుంది. ది లయన్ కింగ్ ఈనెల 19న భారత్ లోని అన్ని ప్రధాన భాషలలో విడుదల కావడం జరిగింది. 3డి ఫార్మాట్ లో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ కి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కించుకుంది.

ఐతే ‘జంగిల్ బుక్’ క్రియేట్ చేసిన రికార్డు కి మాత్రం ది లయన్ కింగ్ చాలా దూరంలో ఉంది. ‘జంగిల్ బుక్’ మూవీ భారత్ లో జీవితకాలంలో 268కోట్ల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఈ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించింది జాన్ ఫావెరు కావడం విశేషము. తెలుగులో లయన్ కింగ్ పాత్రలకు నాని,జగపతి బాబు,అలీ, బ్రహ్మానందం,రవి శంకర్ వంటి ప్రముఖ నటులు డబ్బింగ్ చెప్పారు.

సంబంధిత సమాచారం :