‘మహర్షి’ కోసం రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ !

Published on May 6, 2019 2:15 pm IST

తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ సినిమా భారీ హిట్ బాజాలు మోగించి చాలా కాలమే అయిపొయింది. దాంతో ‘మహర్షి’ రాక కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మే 9న అత్యధిక థియేటర్లలో విడుదలవ్వడానికి సిద్ధం కాబోతున్న ‘మహర్షి’కు ఉన్న క్రేజ్ చూస్తే మాత్రం.. మ‌రో ఏ తెలుగు సినిమాకు (బాహబలి సిరీస్ మినహా) గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు ప్రేక్ష‌కుల నుంచి విశేషమై స్పంద‌న లభిస్తోంది. ‘మహర్షి’ బుకింగ్స్ ఓపెన్ చేసిన క్షణాల్లోనే టికెట్ లు మొత్తం సేల్ అయిపోయ్యాయి.

ఇప్పటికే మల్టీ స్క్రీన్లు, మల్టీ ఫ్లెక్స్ లు ‘మహర్షి’ బుకింగ్స్ కి ‘సౌల్డ్ ఔట్’ అని బోర్డు పెట్టేశాయి. మరో పక్క విపరీతంగా షోలు పెంచినా, సినిమాకి ఉన్న డిమాండ్ చూసి థియేటర్ల యాజమాన్యం టికెట్లు రేట్లు అమాంతం పెంచినా.. టికెట్లు మాత్రం దొరకడం లేదు. రిలీజ్ కి మూడు రోజుల ముందే, ఈ రేంజ్‌ లో హడావుడి వుంటే.. ఇక సినిమాకు గాని సూపర్ హిట్ టాక్ వస్తే.. ‘మహర్షి’ దెబ్బకి నాన్ బాహబలి రికార్డ్స్ అన్నీ తుడుచుకుపెట్టి పోతాయ్. ఏమైనా ఈ రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ ను చూస్తుంటే.. ‘మహర్షి’ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో సరి కొత్త రికార్డ్స్ ను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

కాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More