ఇండస్ట్రీని మళ్ళీ అయోమయంలో పడేసింది !

Published on Apr 24, 2021 9:00 pm IST

ఒక సినిమా తీయడానికి సుమారు ఏడాది పాటు కష్టపడతారు. దర్శకనిర్మాతలు తమ భవిష్యత్తును, హీరో తన మార్కెట్ ను పన్నంగా పెట్టి సినిమా చేస్తే.. అది అసలు రిలీజ్ అవుతుందా లేదా ? రిలీజ్ అయినా హిట్ అవుతుందా లేదా అనేది గ్యారంటీ లేదు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఉంటే.. దానికి తోడు కొత్తగా కరోనా భయం పట్టుకుంది ఇండస్ట్రీ జనాలకు. మొత్తానికి కోవిడ్ సెకండ్ వేవ్ తో మళ్ళీ సినిమా ఇండస్ట్రీని అయోమయంలో పడేసింది. నిజానికి గతేడాది కన్నా ప్రస్తుతం ఎక్కువగా కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది.

దాంతో సినిమాల పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుంది. ఇలాగే మరో నాలుగు నెలలు ఉంటే ఏమిటి పరిస్థితి ? ఇప్పటికే తమ సినిమాల రిలీజ్ డేట్లును వాయిదా వేసుకుంటున్నారు నిర్మాతలు. సమ్మర్ తరువాత రిలీజ్ కి రెడీ అయిన మిగిలిన సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్స్ ను మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అన్ని సినిమాల రిలీజ్ డేట్లు మళ్ళీ తారుమారు అవుతున్నాయి. ఇలా అయితే ఈ ఏడాది కూడా సినిమాకి ఇప్పట్లో భవిష్యత్తు లేనట్లే. మరి చూడాలి ఏమి జరుగుతుందో.

సంబంధిత సమాచారం :